Lesbian Engagement: లెస్బియన్ ఎంగేజ్‌‌మెంట్.. ఇద్దరూ డాక్టర్లే...!

Lesbian Engagement: ఇటీవల తెలంగాణలో ఓ 'గే' జంట ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అలాగే నాగ్‌పూర్‌లో ఓ లెస్బియన్ జంట ఎంగేజ్‌‌మెంట్ చేసుకుంది.

Update: 2022-01-06 02:45 GMT

Lesbian Engagement: ఇటీవల తెలంగాణలో ఓ 'గే' జంట ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అలాగే నాగ్‌పూర్‌లో ఓ లెస్బియన్ జంట ఎంగేజ్‌‌మెంట్ చేసుకుంది.. త్వరలోనే వీరి వివాహం గోవాలో జరగనుంది. సురభి మిత్ర మరియు పరోమితా ముఖర్జీ ఇద్దరు వృతిరీత్యా డాక్టర్లు కావడం విశేషం. ఇద్దరూ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం మరో విశేషం.

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో లాగే వీరి ప్రేమలో కూడా ట్విస్టులున్నాయి. స్టడీ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలంగా సహజీవనం చేశారు. అయితే ముందుగా వీరి ప్రేమని పెద్దలు అంగీకరించలేదు.. కానీ వారిని ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యేందుకు రెండేళ్ళ సమయం పట్టింది. ఇక్కడో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పరోమిత ముఖర్జీలో లెస్బియన్ లక్షణాలను ఆమె తండ్రి ముందే గుర్తించారు. ఆ తర్వాత ఆమెకి సపోర్ట్ గా నిలిచారు.

అయితే పరోమిత తల్లి మాత్రం తన కూతురు లెస్బియన్ అని తెలిసి షాక్ అయ్యింది. ఆ తర్వాత సంతోషంగా ఉండాలని కోరుకుంది.. దీనితో పెళ్ళికి అంగీకరించింది. అటు సురభి మిత్ర తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో విషయం చెప్పగానే అంగీకరించారు. ప్రమిత స్వస్థలం కోల్‌కతా కాగా సురభిది నాగ్‌పూర్

Tags:    

Similar News