Manoj Pande : కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్‌ పాండే..!

Manoj Pande : భారత ఆర్మీ చీఫ్‌గా ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Update: 2022-04-19 01:15 GMT

Manoj Pande : భారత ఆర్మీ చీఫ్‌గా ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. మనోజ్ పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నవరణె స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక కార్ప్స్​ఆఫ్​ఇంజినీర్స్​నుంచి ఆర్మీ చీఫ్​ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం.

భారత ఆర్మీ చీఫ్​ కోసం మనోజ్ పాండేతో పాటు జై సింగ్ నయన్, యోగేంద్ర దిమ్రీ, అమర్​దీప్ సింగ్ భిందర్ పేర్లను కేంద్రం పరిశీలించింది. అయితే వీరిలో అత్యంత సీనియర్‌ అయిన మనోజ్ పాండేకే కేంద్రం ఒకే చెప్పింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే.. డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితులు అయ్యారు. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ విజయ్ సమయంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Tags:    

Similar News