సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు సర్కార్ పొడిగించింది.;
జార్ఖండ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్ర సర్కార్ లాక్‌డౌన్ విధించి అమలు చేస్తోంది. అయినా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు జార్ఖండ్ సర్కార్ పొడిగించింది. సాంఘిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపులు, పెద్ద పెద్ద సమ్మేళనాలు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని సర్కార్ తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ, కోచింగ్ సంస్థలతో సహా విద్యాసంస్థలు మూసి ఉంటాయి. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. తాజా నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని సర్కార్ తెలిపింది.
కాగా, జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,676కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 378 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం 10,799 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 23,499 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.