మే 03 వరకు గోవాలో లాక్ డౌన్..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి గోవా కూడా చేరిపోయింది.

Update: 2021-04-28 09:00 GMT

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి గోవా కూడా చేరిపోయింది. రేపు రాత్రి ఏడూ గంటల నుంచి మే 03వ తేదీ ఉదయం వరకు లాక్ డౌన్ ని విధించింది. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ టైంలో అత్యవసర, పారిశ్రామిక పనులకి మాత్రమే అనుమతి ఉంటుందని, క్యాసినోలు, హోటళ్ళు, పబ్బులను పూర్తిగా మూసివేస్తామని అన్నారు.

అత్యవసర రవాణాకు రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అటు వలస కూలీలు రాష్ట్రాన్ని విడిచిపెట్టవద్దని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆయన అన్నారు. కాగా గోవాలో గడిచిన 24 గంటల్లో 2,110 కరోనా కేసులు బయటపడగా, 31 మంది మరణించారు. 

Tags:    

Similar News