మహారాష్ట్రలో పలు నగరాల్లో జనతా కర్ఫ్యూ

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. ప్రతీ రోజూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నారు

Update: 2020-09-17 14:54 GMT

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. ప్రతీ రోజూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నారు. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో స్వచ్చందంగా కర్ఫ్యూ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. నాగ్‌పూర్‌లో రెండు వారాంతాల్లో స్వచ్చందంగా నిర్భందంలో ఉండాలని ప్రజలే నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 18 రాత్రి నుంచి సెప్టెంబర్ 21 ఉదయం వరకు, సెప్టెంబర్ 25 రాత్రి నుంచి సెప్టెంబర్ 28 ఉదయం వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు.

నగరంలో పెరుగుతున్న కేసులు, మరణాల విషయంలో ఆందోళన చెంది సామాన్యులు చేసిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని నగర మేయర్ సందీప్ జోషి తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజుల్లో ఇళ్లనుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.  

Tags:    

Similar News