Om Birla: ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
Om Birla: 48 గంటల్లో పూర్తి రిపోర్టు ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు;
OM Birla: ఎంపీ బండి సంజయ్ అరెస్టుపై స్పందించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. 48 గంటల్లో పూర్తి రిపోర్టు ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాలతో రాష్ట్ర సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది హోంశాఖ. అరెస్టుపై పూర్తి సమాచారం 48 గంటల్లోగా ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది. విచారణలో ఎంపీ బండి సంజయ్ వాదనలు కూడా తీసుకోవాలని సూచించారు స్పీకర్ ఓం బిర్లా.