రైతులకు మద్దతుగా హర్యానా ఎమ్మెల్యే రాజీనామా!
అయితే రైతుల ఆందోళనకు సంఘీభావంగా హర్యానాకి చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దల్ (ఐఎన్ఎల్‌డీ) నాయకుడు అభయ్‌సింగ్ చౌతలా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.;
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నిన్న ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారీ తీసింది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలీసులకు, రైతులకి మధ్య ఘర్షణ నెలకొంది. ఇందులో కొందరు రైతులు, పోలీసులు గాయపడ్డారు. అయితే రైతుల ఆందోళనకు సంఘీభావంగా హర్యానాకి చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దల్ (ఐఎన్ఎల్‌డీ) నాయకుడు అభయ్‌సింగ్ చౌతలా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోవడంతోనే తాను రాజీనామా చేశానని అభయ్ చౌతాలా పేర్కొన్నారు. కాగా ఆయన రాజీనామాను హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా ఆమోదం తెలిపారు.