cylinder price : వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంపు..!
cylinder price : ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న....సామాన్యులకు మరో షాక్ తగిలింది.;
cylinder price : ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న....సామాన్యులకు మరో షాక్ తగిలింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర మరో 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో రాష్ట్రంలో సిలిండర్ 1052 రూపాయలకు చేరింది. దీంతో సిలిండర్ మరింత భారం కానుంది. అటు....ఈ నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరపై 102 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర 2 వేల 3 వందలు దాటింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించారు.