Luxurious house for Rs. 1 lakh:లక్ష రూపాయల్లో లగ్జరీ ఇల్లు.. ఎక్కడో తెలిస్తే..: ఆనంద్ మహీంద్రా ఫిదా

Luxurious house for Rs. 1 lakh: ఈ ఇంట్లో ఇంధన అవసరాలను తీర్చడానికి సోలార్ ప్యానెల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెల్స్ అందిస్తాయి.

Update: 2021-03-02 05:21 GMT

Luxurious house for Rs. 1 lakh

Luxurious house for Rs. 1 lakh: విలాసవంతమైన ఈ ఇల్లు నిర్మించడానికి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అదే సమయంలో అరుణ్ ప్రభు ఈ ఇంట్లో ఇంధన అవసరాలను తీర్చడానికి సోలార్ ప్యానెల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెల్స్ అందిస్తాయి. దీనితో పాటు ఈ ఇంట్లో వాటర్ ట్యాంక్ కూడా అమర్చారు.

ప్రజలు తమకు విలాసవంతమైన ఇల్లు కాకపోయినా, ఓ సాధారణ ఇల్లైనా సరే కచ్చితంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. కానీ ప్రపంచంలో 1 లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేసి విలాసవంతమైన ఇంటిని నిర్మించిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆనంద్ మహీంద్రాకు ఈ విషయం తెలియగానే, అతడిని ప్రశంసించ కుండా ఉండలేకపోయారు. అందుకే ఆ వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు. మహీంద్రా పికప్ మరియు బొలెరోలను ఇదే విధంగా విలాసవంతమైన గృహంగా మార్చమని ఆ వ్యక్తిని ఆహ్వానించారు.

చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే వ్యక్తి తన ఆటోలో విలాసవంతమైన ఇంటిని నిర్మించాడు. ఇంటికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ విలాసవంతమైన ఇంట్లో చాలా స్థలం ఉంది మరియు వెంటిలేషన్ కూడా సరిపడా ఉంది. దీనితో పాటు, పైకప్పుపై బట్టలు ఆరబెట్టుకునేందుకు ఏర్పాటు, కిటికీలు, తలుపులు కూడా అరుణ్ అందించారు. మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో అరుణ్ ఐడియాను మెచ్చుకుంటూ ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూడటం ద్వారా, ఆటోలో నిర్మించిన ఇల్లు ఎంత విలాసవంతమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు.

ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా.. అరుణ్ తక్కువ స్థలం ఇల్లు కట్టి చూపించారని, కరోనా కాలం తరువాత బ్రతుకు బండి సాగించడానికి ఇబ్బంది పడే ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అరుణ్ బొలెరో పికప్ పైభాగంలో ఇలాంటివి చేయగలిగితే తాను సంతోషిస్తానని రాశారు. ఇందుకుగాను అరుణ్‌ తనతో సంప్రదించాలని ప్రజలను కోరారు. 

Tags:    

Similar News