Ganga Vilas luxury Cruise: రూ.20 లక్షలుంటే 51 రోజులు గంగా విలాస్ లగ్జరీ క్రూయీజ్‌లో ఎంజాయ్..
Ganga Vilas luxury Cruise: 36 మంది ప్రయాణించే ఈ క్రూయిజర్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు, విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
Ganga Vilas luxury Cruise: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి నుండి MV గంగా విలాస్ లగ్జరీ క్రూయిజ్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌గా పేర్కొనబడిన ఈ ఓడ వారణాసి నుండి 51 రోజుల పాటు ప్రయాణించి 3,200 కి.మీ.లు 27 నదులు, అనేక రాష్ట్రాలను దాటి అస్సాంలోని డిబ్రూఘర్‌లో తన ప్రయాణాన్ని ముగించనుంది.
ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాల సందర్శనలతో ఈ ప్రయాణం హ్యాపీగా సాగుతుంది.
లగ్జరీ క్రూయిజ్ గురించి మరిన్ని విశేషాలు..
36 మంది ప్రయాణించే ఈ క్రూయిజర్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు, విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారని క్రూయీజ్ నిర్వాహకులు తెలిపారు.
బౌద్ధ క్షేత్రమైన వారణాసిలోని ప్రసిద్ధ గంగా ఆరతిని కవర్ చేస్తుంది. అస్సాంలోని అతిపెద్ద నదీ ద్వీపం మజులి సందర్శన కూడా ఉంటుంది. యాత్రికులు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా మరియు విక్రమశిలా యూనివర్సిటీని కూడా సందర్శిస్తారు. ఈ క్రూయిజ్ బంగాళాఖాతం డెల్టాలోని సుందర్‌బన్స్, అలాగే కజిరంగా నేషనల్ పార్క్ గుండా ప్రయాణిస్తుంది.
ఈ ఫైవ్ స్టార్ మూవింగ్ హోటల్ గురించి డైరెక్టర్ రాజ్ సింగ్ మాట్లాడుతూ.. 36మంది ప్రయాణీకులతో పాటు ఇందులో 40 మంది సిబ్బందికి వసతి ఉంది. క్రూయిజ్‌లో స్పా, సెలూన్ మరియు జిమ్ వంటి సౌకర్యాలు కూడా అమర్చబడ్డాయి.
ఈ క్రూయిజ్‌లో కాలుష్య రహిత వ్యవస్థ మరియు శబ్ద నియంత్రణ సాంకేతికత అమర్చబడిందని సింగ్ చెప్పారు. ఈ క్రూయిజ్‌లో మురుగునీరు గంగలోకి ప్రవహించకుండా ఎస్‌టీపీ ప్లాంట్‌తో పాటు స్నానానికి, ఇతర అవసరాలకు గంగాజలాన్ని శుద్ధి చేసే ఫిల్ట్రేషన్ ప్లాంట్ ఉందని తెలిపారు.
ఈ విలాసవంతమైన క్రూయీజ్ ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే ఒక పర్యాటకుడు రోజుకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 51 రోజుల ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని సింగ్ చెప్పారు. గంగా విలాస్ లగ్జరీ క్రూయిజ్ కోసం టిక్కెట్లను క్రూయిజ్ నిర్వహిస్తున్న కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారతీయులకు, విదేశీయులకు ఛార్జీలు ఒకే విధంగా ఉంటాయని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి ఆయుష్ సర్బానంద సోనోవాల్ తెలిపారు.