సీఎం మమతా బెనర్జీకి స్వల్ప గాయం..!

టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి గాయమైంది. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని దీదీ ఆరోపించారు.

Update: 2021-03-10 15:30 GMT

సీఎం మమతా బెనర్జీకి స్వల్ప గాయం..!గ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం అక్కడి నుంచి బయల్దేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాను కారు వద్ద నిల్చొని ఉండగా.. కొంత మంది వ్యక్తులు తనను గాయపరిచే ఉద్దేశంతో కారు డోరును బలంగా తోసేశారని దీదీ ఆరోపించారు. తన కాలికి బలమైన గాయమైందని తెలిపారు. దీని వెనుక కుట్ర దాగుందని ఆమె అన్నారు. ఘటన జరిగిన సమయంలో స్థానిక పోలీసులు ఎవరూ తన చుట్టూ లేరని చెప్పారు. ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. అనంతరం ఆమె నేరుగా అక్కడ నుంచి స్థానిక ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

Tags:    

Similar News