Mamata Banerjee : ట్విట్టర్‌లో గవర్నర్‌ను బ్లాక్ చేసిన మమతా బెనర్జీ
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ట్విటర్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను బ్లాక్ చేసారు.;
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ట్విటర్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను బ్లాక్ చేసారు. గవర్నర్ ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ధన్‌ఖర్‌ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. గవర్నర్ తీరుతో గత ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పంపిన ప్రతి ఫైలు పెండింగులో పెడుతున్నారని, విధాన నిర్ణయాలపై ఆయనెలా మాట్లాడతారని మండిపడ్డారు. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల తాను అందరికీ క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు.