Mamata Banerjee : ప్రధాని మోదీపై మరోసారి మండిపడిన సీఎం మమతా బెనర్జీ..!
ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మరోసారి మండిపడ్డారు. తన విదేశీ పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.;
Mamata Banerjee : ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మరోసారి మండిపడ్డారు. తన విదేశీ పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం వచ్చినా ఇటలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తానూ హిందూ మహిళనే అని, ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. తనకు విదేశాలకు వెళ్లాలనే మోజు లేదన్న మమతా బెనర్జీ.. ఇటలీకి వెళ్లకుండా తననెవరూ అడ్డుకోలేరన్నారు. అక్టోబర్‌లో మథర్ థెరిస్సా స్పూర్తిగా ఇటలీలో ప్రపంచ శాంతి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నిర్వాహకులు సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపింది. తన విదేశీ పర్యటనకు అనుమతించాలని మమతా బెనర్జీ కోరగా.. కేంద్రం నిరాకరించింది.