ఢిల్లీలో సోనియాగాంధీతో మమతా బెనర్జీ భేటీ..!
తృతీయ కూటమి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ... ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు.;
తృతీయ కూటమి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ... ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం... 2024 ఎన్నికల వ్యూహాలు, భవిష్యత్ పోరాటాలపై చర్చించారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతను సోనియా గాంధీ కోరుకుంటున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ విశ్వాసంలోకి తీసుకుంటుందని... అలాగే కాంగ్రెస్‌పై ప్రాంతీయ పార్టీలకు విశ్వాసం ఉందని మమత అన్నారు. రానున్న ఎన్నికల్లో మోదీకి వ్యతిరేక అభ్యర్థి ఎవరన్నది.. ప్రతిపక్షాల నాయకులందరూ కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. దేశ ప్రజలను మోదీ సర్కారు దోచుకుంటోందని...GDP అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్‌గా మారిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో విపక్షం బలంగా తయారుకాబోతోందని... ప్రతిపక్షాలు చరిత్ర సృష్టించబోతున్నాయని... మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.