గాంధీ విగ్రహం వద్ద సీఎం మమత బెనర్జీ నిరసన దీక్ష

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు.

Update: 2021-04-13 11:30 GMT

గాంధీ విగ్రహం వద్ద సీఎం మమత బెనర్జీ నిరసన దీక్షకోల్‌కతాలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ప్రచారంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్న అభియోగంపై ఈసీ మమతపై ఒకరోజు నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.

ప్రచారంలో భాగంగా ముస్లింలు గుంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలని మమతా పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలపై తిరగబడమని చెప్పి మమత.. ప్రజలను రెచ్చగొట్టిందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేసారు. వీటిపై సమాధానం ఇవ్వాలని ఈసీ.. దీదీకి గత వారం నోటీసులు జారీ చేసింది. మమత వ్యాఖ్యలపై సంతృప్తి చెందని ఈసీ 24 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని, సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రచారం జరపరాదని ఆంక్షలు పెట్టింది. 

Tags:    

Similar News