Bihar: ప్రియుడితో భార్య జంప్.. చేసేదేం లేక అతడి భార్యను ఇతడు..
Bihar: కొన్ని సంఘటనలు వినడానికే వింతగా ఉంటాయి. బీహార్‌లోని ఖగారియాలో భార్యపై, ఆమె ప్రేమికుడిపై పగ తీర్చుకునేందుకు భర్త ఎంచుకున్న పద్ధతి చర్చనీయాంశంగా మారింది.;
Bihar: కొన్ని సంఘటనలు వినడానికే వింతగా ఉంటాయి. బీహార్‌లోని ఖగారియాలో భార్యపై, ఆమె ప్రేమికుడిపై పగ తీర్చుకునేందుకు భర్త ఎంచుకున్న పద్ధతి చర్చనీయాంశంగా మారింది.తన భార్య తనతో పెళ్లికి ముందే ప్రేమించిన ప్రియుడు ముఖేష్‌తో పారిపోయిందని తెలుసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన నీరజ్ పస్రాహా పోలీస్ స్టేషన్‌లో ముఖేష్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. గ్రామంలో పలుమార్లు పంచాయితీ కూడా పెట్టించాడు. అయినా ముఖేష్ చెలించలేదు. ముఖేష్, నీరజ్ భార్య రూబీతో అదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఏం చేయాలో పాలుపోని నీరజ్‌కి ముఖేష్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నీరజ్ నిందితుడు ముఖేష్ భార్యతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. విశేషమేమిటంటే ఇద్దరి భార్యల పేర్లు రూబీ.
మాన్సీ బ్లాక్‌లోని అమని గ్రామానికి చెందిన రూబీ దేవితో ముఖేష్‌కు వివాహమైంది. ముఖేష్ తన మొదటి భార్యను విడిచిపెట్టి నీరజ్ భార్యతో నివసిస్తున్నాడు. నీరజ్ ముఖేష్ పై పగ తీర్చుకోవడానికి ముఖేష్ భార్య రూబీకి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో వారి మధ్య సంభాషణ ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. గ్రామం నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరికీ సపోర్ట్ కావాలి. అటువంటి పరిస్థితిలో, వారిద్దరూ 18 ఫిబ్రవరి 2023 న గ్రామం నుండి పారిపోయి ఆలయంలో వివాహం చేసుకున్నారు. నీరజ్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా ముఖేష్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పెళ్లి వార్త గ్రామం నుంచి పట్టణానికి వ్యాపించడంతో సర్వత్రా చర్చ మొదలైంది.