Maoist Kidnap: రెండేళ్ల బిడ్డతో మావోయిస్టులకు ఎదురెళ్లింది.. భర్త ప్రాణాలు దక్కించుకుంది..
Maoist Kidnap: ఎట్టకేలకు ఆ ఇళ్లాలి పోరాటం ఫలించింది. రెండేళ్ల చిన్నారితో అడవి బాట పట్టింది అర్పిత..;
Maoist Kidnap (tv5news.in)
Maoist Kidnap: ఎట్టకేలకు ఆ ఇళ్లాలి పోరాటం ఫలించింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెండేళ్ల చిన్నారితో అడవి బాట పట్టిన అర్పిత.. మొత్తనికి భర్తను తిరిగి దక్కించుకుంది. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మన్ కేళి దగ్గర వారం కిందట మావోయిస్టులు లక్ష్మణ్, అజయ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. మరుసటి రోజు లక్ష్మణ్ ను విడిచిపెట్టారు. అజయ్ ని మావోయిస్టులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇంజనీర్ అయిన అజయ్ అనే వ్యక్తి అర్పిత భర్త.
భర్త అజయ్ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవిబాట పట్టింది అర్పిత. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని మీడియాతో కలిసి అడవిలోకి వెళ్లింది. తన భర్తను ప్రాణాలతో విడిచిపెట్టాలని మావోయిస్టులను విజ్ఞప్తి చేసింది. మొత్తానికి అర్పిత పోరాటం ఫలించింది. ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు అజయ్ ని విడిచిపెట్టారు. భార్య పోరాటంతో క్షేమంగా ఆమె వద్దకు చేరుకున్నాడు ఇంజనీర్ అజయ్.