ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ విధ్వంసం..
ఆదివారం రాత్రి సుక్మా జిల్లా ఎర్రబోరు సమీపంలో 30వ నెంబరు జాతీయ రహదారిపై పది వాహనాలను అడ్డుకొని నిప్పు పెట్టారు.;
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లా ఎర్రబోరు సమీపంలో 30వ నెంబరు జాతీయ రహదారిపై పది వాహనాలను అడ్డుకొని నిప్పు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరుకు 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. తమను అణచివేసేందుకు కేంద్రరాష్ట్ర బలగాలు ఆపరేషన్ ప్రహార్-3 పేరిట ఛత్తీస్‌గఢ్‌లో పలు దాడులకు పాల్పడుతున్నాయని.. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ వేగవంతం చేశాయి.