Microsoft lay off: మైక్రోసాప్ట్‌లో ఉద్యోగుల ఊచకోత.. దాదాపు 11,000 మంది

Microsoft lay off: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టెక్ కంపెనీలలో తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య ఈ వారం దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.

Update: 2023-01-18 07:20 GMT

Microsoft lay off: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టెక్ కంపెనీలలో తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య ఈ వారం దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. "రాబోయే రెండు సంవత్సరాలు బహుశా చాలా సవాలుగా ఉంటాయి" అని అన్నారు.




"ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో తన శ్రామికశక్తిని తగ్గించేందుకు ప్రణాళికలను ఖరారు చేస్తోంది" అని స్కై న్యూస్ నివేదించింది. మైక్రోసాఫ్ట్ UK లో 220,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ దాదాపు 11,000 ఉద్యోగులను తొగించే పనిలో పడింది. కంపెనీ బుధవారం (యుఎస్ కాలమానం ప్రకారం) తొలగింపులను ప్రకటించే అవకాశం ఉంది.


గత కొన్ని వారాల్లో, అమెజాన్ 18,000 ఉద్యోగాలను తగ్గించడంతో పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సేల్స్‌ఫోర్స్ 7,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించనుంది.



భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 2023లో సగటున రోజుకు 1,600 మంది టెక్ ఉద్యోగులు తొలగించబడ్డారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం మరియు మాంద్యం భయాల మధ్య తొలగింపు ఎపిసోడ్‌లు వేగం పుంజుకున్నాయి.



ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు 2023 సంవత్సరం ప్రారంభంలోనే చేదు వార్తలు వినాల్సి వస్తోంది. 91 కంపెనీలు ఈ నెల మొదటి 15 రోజుల్లో 24,000 కంటే ఎక్కువ మంది టెక్ ఉద్యోగులను తొలగించాయి. ఇక రాబోయే రోజులు మరింత అధ్వాన్నంగా ఉండబోతున్నయనడానికి ఇవి సూచికలుగా మారనున్నాయి. 

Tags:    

Similar News