Mid-day Meal: మధ్యాహ్న భోజనంలో బల్లి.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
Mid-day Meal:;
Karnataka Mid-day Meal: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వడకెహల్లా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు అవుతున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్ధారించారు. చామరాజనగర్ జిల్లా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ ఎస్‌ఎన్ మాట్లాడుతూ, విద్యార్థులకు వడ్డించే 'సాంబార్' (పప్పు మరియు కూరగాయల పులుసు) లో ఒక వంటవాడు బల్లి ఉందని గుర్తించాడు. వెంటనే అతడు విద్యార్థులను సాంబార్ అన్నం తినొద్దని హెచ్చరించాడు.
విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంపై దాడికి దిగారు. చిన్నారుల ప్రాణాలపై అంత నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. బెంగళూరులో అనేక పాఠశాలలు కోవిడ్ కారణంగా మూతపడ్డాయి. కొన్ని పాఠశాలలు మరియు కళాశాలలు తగిన జాగ్రత్తలు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.