ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.;
మిషన్ కర్మయోగి పేరుతో.. సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సివిల్ సర్వీసులపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసుల సామర్ధ్య పెంపు కోసం జాతీయ కార్యక్మంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని... కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను .. ఆయన వెల్లడించారు. ఇక జమ్ము కశ్మీర్‌లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లిష్‌లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అటు.. జపాన్, ఫిన్‌లాండ్, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖలు.. ప్రతిపాదిత మూడు MOUలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు ప్రకాశ్ జవదేకర్.