తల్లీ, ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన వాటర్ హీటర్

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అమ్మని పట్టుకున్నారు.;

Update: 2020-12-19 08:40 GMT

మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు.. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అమ్మని పట్టుకున్నారు. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు విద్యుత్‌ఘాతానికి గురై మరణించారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వ మండలం గుళ్లెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్, కవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు.

రోజు మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా వాటర్ హీటర్‌తో నీళ్లు పెట్టుకున్నారు. అయితే సమయంలో కవిత చేయి వాటర్ హీటర్‌కు తగలడంతో షాక్‌కు గురైంది. తల్లి పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్ కుమార్ (11), వెంకటసాయి (8)లకు ఆ విషయం తెలియక అమ్మని పట్టుకున్నారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. భార్యా పిల్లలు ఇలా ఒకేసారి మరణించడంతో సతీష్ హతాశుడయ్యాడు. స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News