Odisha : కొడుకుతో కలిసి పరీక్ష రాసిన తల్లి..!
Odisha : తల్లీకొడుకులిద్దరూ ఒకేసారి మెట్రిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో చోటుచేసుకుంది.;
Odisha : తల్లీకొడుకులిద్దరూ ఒకేసారి మెట్రిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో చోటుచేసుకుంది. జ్యోత్స్న పాఢి, అలోక్‌నాథ్ పాత్రొ.. ఇద్దరు తల్లీకొడుకులు... తల్లి జయపురం ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అభ్యర్థిగా, కొడుకు పూజారిపుట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరయ్యారు.
పెళ్లి తర్వాత కుటుంబ సమస్యల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసిన జోస్నకి మళ్ళీ చదువుకోవాలన్న కోరిక పుట్టింది. భర్త త్రినాథ్‌ప్రసాద్ పాత్రొ ప్రోత్సాహంతో మళ్ళీ చదువును ప్రారంభించింది. లాక్డౌన్ సమయంలో తన కొడుకు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేవాడని, ఆ సమయంలో తాను కూడా అతని పక్కనే కూర్చొని ఏదీ మిస్ కాకుండా అన్ని క్లాస్ లను వినేదానిని అని చెప్పుకొచ్చింది.
అయితే ఆమె ఉత్సాహం, చదువు పూర్తి చేయాలనే కోరికను చూసి కరెస్పాండెన్స్ కోర్సులో చేర్పించానని జోస్న భర్త చెప్పుకొచ్చాడు.. ఆమె తమ కొడుకు అలోక్‌నాథ్‌తో కలిసి బోర్డు పరీక్షకు హాజరవడం తనకి చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.