బిలియనీర్ ముఖేష్ అంబానీకి ప్రమోషన్..

ఆకాష్ అంబానీ 2019 మార్చిలో డైమండ్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాను వివాహం చేసుకున్నారు.;

Update: 2020-12-11 04:32 GMT

బిలియనీర్ ముఖేష్ అంబానీకి తాతగా ప్రమోషన్ వచ్చింది. గురువారం తన పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి కుమారుడు జన్మించాడు. ఆకాష్ అంబానీ భార్య శ్లోక ముంబైలోని హాస్పిటల్‌లో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చిందని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఆకాష్ అంబానీ 2019 మార్చిలో డైమండ్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాను వివాహం చేసుకున్నారు. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు.. ఆకాష్, ఇషా, అనంత్. అంబానీ కుటుంబం ఆ మధ్య విదేశాలకు వెళ్లి దీపావళికి ముందే ముంబైకి తిరిగి వచ్చారు. "నీతా, ముఖేష్ అంబానీలు నానమ్మ, తాతయ్య కావడం ఆనందంగా ఉందని ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News