Isha Ambani: ముఖేష్ అంబానీ ఇంట సంబరం.. కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ..
Isha Ambani: ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది.;
Isha Ambani: ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. శనివారం నాడు ఆమెకు ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ పుట్టారు. ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరమల్ తమ కవలలను స్వాగతించారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు ఆదియా, కృష్ణ అని పేర్లు పెట్టారు.
తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇషా, ఆనంద్‌ల వివాహం డిసెంబర్ 2018లో అల్టామౌంట్ రోడ్‌లో ఉన్న విలాసవంతమైన నివాసం యాంటిలియాలో జరిగింది. వివాహ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు.