Mukesh Ambani : అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకే.. రిజిస్ట్రేషన్ కోసమే ఏకంగా..
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల ఓ అల్ట్రా లగ్జరీ కారుని కొనుగోలు చేశారు.;
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల ఓ అల్ట్రా లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీని విలువ అక్షరాలు రూ. 13.14 కోట్లు. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు బ్రిటిష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ చెందింది. ఈ కారును సౌత్ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO)లో జనవరి 31న కంపెనీ రిజిస్టర్ చేయబడింది.
రిజిస్ట్రేషన్ కోసం అంబానీ ఏకంగా రూ.20 లక్షల పన్ను చెల్లించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు.. ఇక ఈ కారు కోసం అంబానీ వీఐపీ నంబర్ కూడా తీసుకున్నారని, ఈ నంబర్ 0001తో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెంబర్ కోసం అంబానీ రూ. 12 లక్షలు ఖర్చు చేశారని సమాచారం.
ఈ కారును రోల్స్ రాయిస్ తొలిసారిగా 2018లో రిలీజ్ చేసింది. అప్పుడు దీని ధర రూ.6.95 కోట్లు.. కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు చేసిన తర్వాత దీని ధర మరింతగా పెరిగింది. 2.5 టన్నులకు పైగా బరువున్న ఈ 12 సిలిండర్ల కారు 564 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.