Narendra Modi: ప్రధాని మోదీ ట్విటర్‌ ఎకౌంట్ హ్యాక్‌.. బిట్‌కాయిన్‌‌పై పోస్ట్..

Narendra Modi: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

Update: 2021-12-12 03:00 GMT

Narendra Modi (tv5news.in)

Narendra Modi: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈరోజు తెల్లవారు జామున హ్యాక్‌కు గురయితే, కొద్దిసేపటి తర్వాత ప్రధాని ట్విట్టర్‌ ఎకౌంట్‌ను ట్విటర్‌ యాజమాన్యం రిపోర్ట్ చేసింది. మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో హ్యాకర్లు.. బిట్‌కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగలైజ్‌ చేశారని, కేంద్రం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని హ్యాకర్లు లింక్‌లు పోస్టు చేశారు.

దీంతో వెంటనే ప్రధాని కార్యాలయం అధికారులు స్పందించి ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్‌లు పోస్టులు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని పీఎంవో పేర్కొంది.

Tags:    

Similar News