National: బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా విస్తరణ

రూ. 600 కోట్ల పెట్టుబడి; పూణే ప్లాంట్‌ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం

Update: 2023-02-06 08:23 GMT

దేశంలో నాణ్యమైన ప్యాసింజర్ టైర్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో బ్రిడ్జ్ స్టోన్ ఇండియా భారీ వ్యూహంతో బరిలోకి దిగుతోంది. రూ. 600 కోట్లకు పైగా పెట్టుబడితో పూణేలోని చకన్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమాయత్తం అవుతోంది. రాబోయే 3ఏళ్లలో సాంకేతికంగా ఆధునిక వనరులు సమకూర్చుకోనుంది. బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా అంతర్దాతీయ స్థాయి టెక్నాలజీని, తయారీ విధానాన్ని భారతలో అందుబాటులోకి తీసుకువస్తోందని బ్రిడ్జ్ స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో తెలిపారు. భారతీయ రోడ్లకు అనుగుణంగా నాణ్యమైన టైర్లతో పాటూ, వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని  పేర్కొన్నారు. టైర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా స్థిరమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. 2013లో పూణేలోని చకన్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. భారతీయ ఆటోమోటివ్ రంగానికి అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ప్లాంట్ సెప్టెంబరు 2022లో ప్యాసింజర్ వెహికల్స్ కోసం ఎక్కువ టైర్ లైఫ్‌తో 'స్టర్డో' టైర్‌ను పరిచయం చేసింది. 

Tags:    

Similar News