NEET Exam : దేశ వ్యాప్తంగా ముగిసిన నీట్‌ పరీక్ష..!

NEET Exam : నీట్‌ ఎంట్రన్స్‌ పరిక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 202 పట్టణాల్లో 3వేల 842 కేంద్రాల్లో పరీక్షను అధికారులు నిర్వహించారు.

Update: 2021-09-12 12:30 GMT

NEET Exam : నీట్‌ ఎంట్రన్స్‌ పరిక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 202 పట్టణాల్లో 3వేల 842 కేంద్రాల్లో పరీక్షను అధికారులు నిర్వహించారు. పెన్ను, పేపరు విధానంలో నిర్వహించిన.. ఈ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగింది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది పట్టణాల్లో 151 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తెలంగాణలోని 7 పట్టణాల్లో 112 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాటు చేశారు. హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష జరిగాయి. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయనున్నారు. 

Tags:    

Similar News