కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు లాభం : మోదీ

కొత్త వ్యవసాయ చట్టం వల్ల దళారీ వ్యవస్థ తగ్గి.. రైతులకు 30 శాతం వరకు ఎక్కువ లాభం చేకూరుతుందని మోదీ అన్నారు

Update: 2020-09-21 09:43 GMT

రాబోతున్న కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పండించిన పంటలను రైతులు స్వయంగా కళ్లంలోగానీ మార్కెట్‌లోగానీ అమ్ముకునే స్వేచ్ఛను ఈ చట్టం కల్పిస్తుందని చెప్పారు. దీని వల్ల దళారీ వ్యవస్థ తగ్గి... రైతులకు 30 శాతం వరకు ఎక్కువ లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. కానీ ప్రతిపక్షాలు రైతుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ చట్టం వల్ల వ్యవసాయ మార్కెట్లకు విలువ లేకుండా పోతుందనే ప్రతిపక్షాల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లు ఇప్పుడున్నట్లే ఉంటాయని.. కాకపోతే ఎక్కడ ధరలు ఎక్కువగా ఉంటే అక్కడ రైతులు పంటలను అమ్ముకోవచ్చని మోదీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News