మార్కెట్లో బజాజ్ బైక్ 100 కిక్ స్టార్ట్.. ప్రారంభ ధర

బజాజ్ ప్లాటినా 100 కేఎస్ బైక్ సరికొత్త ఫీచర్లు, స్టైల్‌తో యువతను ఆకర్షిస్తుంది.;

Update: 2020-12-17 09:50 GMT

టూ వీలర్ వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు బజాజ్ ఓ సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ మోటార్ సైకిల్. కిక్ స్టార్ట్‌‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.51,667గా సంస్థ నిర్ణయించింది.

ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ఈ మోటార్ సైకిల్‌ను పొందవచ్చు. బజాజ్ ప్లాటినా 100 కేఎస్ బైక్ సరికొత్త ఫీచర్లు, స్టైల్‌తో యువతను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇందులో రెండు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాక్ టెయిల్ వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్ విత్ సిల్వర్ డెకల్స్‌తో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైట్లు, హెడ్ ల్యాంప్ క్లస్టర్, క్విల్టెడ్ సీట్లు, సరికొత్తగా డిజైన్ చేసిన ఇండికేటర్లు, మిర్రర్లతో ఆకట్లుకుంటోంది. ఇవి కాకుండా హ్యాండ్ గార్డ్, ప్రొటెక్టివ్ ట్యాంక్ ప్యాడ్, వైడ్ రబ్బర్ ఫుడ్ ప్యాడ్స్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

వీటితో పాటు 102 సీసీ ఎయిర్ కూల్డ్ SOHC సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 7.5 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 8.34 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 4 స్పీడ్ స్థిరమైన మెష్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేస్తుంది. ఈ సరికొత్త ప్లాటినా బైక్ 11 లీటరల్ ఇంధన ట్యాంకు సామర్ద్యాన్ని కలిగి ఉంది. ఇది 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి 117 కేజీల బరువుతో ఉంది. అంతేకాకుండా లీటరుకు గరిష్టంగా 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఈ సరికొత్త బజాజ్ ప్లాటినం బైక్‌లో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక వైపు డ్యూయల్ కాయిల్ స్ర్పింగ్స్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఇది 130 ఎంఎం ఫ్రంట్, 110 ఎంఎం రియల్ డ్రమ్ బ్రేక్స్‌ను కలిగి ఉంది. ప్లాటినా లైనప్ లేటెస్ట్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మోడల్ మైలేజీ బాగా వస్తుంది. 

Tags:    

Similar News