దేశంలోని 10 నగరాల్లో NIA ఆకస్మిక దాడులు
ఢిల్లీతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 10 నగరాల్లో సోమవారం ఉదయం ఏకకాలంలో NIA ఆకస్మిక దాడులు చేసింది.;
దేశంలోని 10 నగరాల్లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఢిల్లీతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 10 నగరాల్లో సోమవారం ఉదయం ఏకకాలంలో దాడులు చేసి ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఐఎస్ ఉగ్రవాదులతో ఏడుగురు వ్యక్తులకు కొంతకాలంగా సంబంధాలున్నాయని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతను రిక్రూట్ చేసి ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చి స్థానికంగా దాడులకు వ్యుహాలు రూపొందించారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది.