Karnataka : పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో కర్ణాటక సర్కార్ అలర్ట్
Karnataka : ఒమిక్రాన్ ముప్పు మరింత పెరుగుతుండటంతో...కర్ణాటక సర్కార్ అలర్ట్ ప్రకటించింది.;
Karnataka : ఒమిక్రాన్ ముప్పు మరింత పెరుగుతుండటంతో...కర్ణాటక సర్కార్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి పది రోజులపాటు రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తూ...బొమ్మె సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పది నుంచి ఉదయం ఐదింటి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూ వేళ బయటకు వస్తే కఠిన చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి కావటంతో... కఠిన ఆంక్షలు దిశగా చర్యలు చేపట్టారు. న్యూ ఇయార్ వేడుకల్లో...భారీగా గుమికూడకుండా ఆంక్షలు విధించారు. వేడుకలు, పంక్షన్లు, పార్టీలు జరపడానికి వీల్లేదని సర్కార్ స్పష్టం చేసింది. ముఖ్యంగా డీజేలపై నిషేధం విధించారు. హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్‌లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలిచ్చింది బొమ్మె సర్కార్.