Nirmala Sitharaman : కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ1.1 లక్షల కోట్ల రుణ హామీ ..!

కోవిడ్‌తో కుదేలైన భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది.;

Update: 2021-06-28 13:30 GMT

కోవిడ్‌తో కుదేలైన భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. దేశంలో వైద్యవసతులు మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వైద్య మౌలిక సౌకర్యాలకు ఊతమిచ్చేందుకు పలు కీలక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్లతో రుణ హామి ఇస్తున్నట్లు తెలిపారు. వైద్యరంగానికి 50వేల కోట్లు, ఇతర రంగాలకు 60 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఆత్మ నిర్బర్‌ భారత్ లో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద అత్యవసర రుణాలను 1.5 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News