Nirmala Sitharaman : వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది : నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు.;
Mirmala Sitharaman : వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. 39 లక్షల కోట్ల అంచనాలతో 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ద్రవ్యలోటు 6.9 శాతమని, దాన్ని 4.5 శాతానికి తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణరంగ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పీఎం గతిశక్తిలో భాగంగా ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.