మీడియా పై ఫైర్ అయిన సీఎం!
ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సహనం కోల్పోయిన నితీష్‌కుమార్ మీడియా పైన ఆగ్రహనికి లోనయ్యారు;
బీహార్ సీఎం నితీష్‌కుమార్ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సహనం కోల్పోయిన నితీష్‌కుమార్ మీడియా పైన ఆగ్రహనికి లోనయ్యారు. 'మీదగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, దయచేసి పోలీసులతో పంచుకోండి' అని అన్నారు సీఎం..
మీరు చాలా గొప్పవారు. నేను సూటిగా అడుగుతున్నాను... మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? అని మీడియాపై సీఎం తన అసహనం ప్రదర్శించారు. ఈ సందర్భంగా లాలూ-రబ్రీ దేవి పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం.. 2005కు ముందు ఆ కుటుంబ 15 ఏళ్ల పాలనలో బీహార్‌లో నేరాలు ఏ తీరుగా ఉన్నాయో మరిచారా? అని ప్రశ్నించారు.
రూపేశ్ కుమార్ సింగ్ హత్య కేసులో నిందితుల గురించి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులతో పంచుకోవాలని, ఈ కేసు పైన సమగ్ర విచారణ జరపాలని పోలీస్ చీఫ్‌ను అదేశించినట్టుగా నితీష్‌కుమార్ తెలిపారు. నితీష్ కామెంట్స్ పైన ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ స్పందించాడు.
సీఎం నితీష్ కుమార్ నేరస్థుల ముందు లొంగిపోయాడని, నేరాలను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. కాగా రూపేష్ కుమార్‌ను తన ఇంటి బయట వాహనం ఎక్కే క్రమంలో కొందరు దుండగులు కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే! ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.