నితీష్ కి షాక్.. బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు!
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు అధికారికంగా బీజేపీలో చేరారు.;
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ(Janata Dal United) అధినేత నితీష్ కుమార్ (Nitish Kumar)కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)కు చెందిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు అధికారికంగా బీజేపీ(BJP)లో చేరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రకటన చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో(2019 assembly elections) జేడీయూ JD(U) 15 స్థానాల్లో పోటి చేయగా, ఏడూ స్థానల్లో గెలిచింది. 41 స్థానాలను దక్కించుకున్న బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ తర్వాత బీజేపీకి జేడీయూ మద్దతు ప్రకటించింది.
ఆ తరవాత ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడం, అవి తారస్థాయికి చేరడంతో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలం 48కి చేరింది. ఇప్పుడు జేడీయూలో ఒక్కరు మాత్రమే మిగిలారు. ఇక కాంగ్రెస్ కి నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి నలుగురు సభ్యుల బలం ఉంది. ఇక ఏకైక సభ్యుడు గల పీపుల్స్ పార్టీ ఆఫ్ ఆరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.