Gujarat bridge tragedy: అనుమతుల్లేవ్.. అయినా ఓపెన్ చేశారు..

Gujarat bridge tragedy: గుజరాత్ వంతెన విషాదం అధికారుల అలసత్వానికి ఓ మాయని మచ్చలా మిగిలింది.

Update: 2022-11-01 10:48 GMT

Gujarat Cable Bridge Tragedy: గుజరాత్ వంతెన విషాదం అధికారుల అలసత్వానికి ఓ మాయని మచ్చలా మిగిలింది. ఒరేవా అనే ప్రైవేట్ ట్రస్ట్ వంతెనను పునరుద్ధరించింది. మరమ్మతుల కోసం వంతెనను ఏడు నెలలుగా మూసివేశారు. రిపేర్లు పూర్తి చేసుకుని అక్టోబరు 26న తిరిగి తెరవబడింది.


శతాబ్ద కాలం నాటి వంతెన తిరిగి తెరవడానికి ముందు అధికారుల నుండి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోలేదని స్థానిక మున్సిపల్ బాడీ చీఫ్ జాతీయ మీడియాకు తెలిపారు.

వంతెన కూలి 100 మందికి పైగా మరణించారు. 80 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 200 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు.

నాణ్యతా తనిఖీని పొందవలసి ఉంది. కానీ అలా చేయలేదు. ప్రభుత్వానికి దీని గురించి తెలియదు.

రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల మధ్య ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నారు.

Tags:    

Similar News