కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదు: మోదీ

ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు.

Update: 2021-02-10 13:15 GMT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదని ప్రధాని మోదీ అన్నారు. ఈ సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా? సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర దక్కలేదా? అని ప్రశ్నించారు. సభలో కావాలనే కొందరు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎందుకు చేస్తాం? సాగు చట్టాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు.

ఇప్పటికే ఉన్న వ్యవసాయ మార్కెట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని... దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరమని చెప్పారు ప్రధాని. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో ఏ నిర్ణయానికైనా వందశాతం ఆమోదం రాదని చెప్పారు. ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడవాలని అన్నారు. స్వచ్ఛ భారత్‌, జన్‌ధన్‌ ఖాతాలు కావాలని ప్రజలెవరూ అడగలేదని ఇవాళ ఎంతోమంది ఆ పథకాలను ప్రశంసిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఎలాంటి మార్పులు రాకూడదని కొందరు కోరుకుంటారని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News