100 నోట్ల రద్దు చేస్తారన్న ప్రచారంపై స్పందించిన రిజర్వు బ్యాంకు
100, పది, ఐదు రూపాయల నోట్లను రద్దు చేస్తూ RBI మార్చి నెలలో కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ప్రచారం జరుగుతోంది.;
మన దేశానికి చెందిన పలు పాత నోట్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసింది. 100, పది, ఐదు రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వివరణనిస్తూ ట్వీట్ చేసింది.
2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అలాగే ఇప్పుడు 100, పది, ఐదు రూపాయల నోట్లను రద్దు చేస్తూ RBI మార్చి నెలలో కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటి వదంతులు నమ్మొద్దని RBI సూచించింది.