NPS, PPF and Sukanya Samriddhi: బీ అలెర్ట్.. NPS, PPF, సుకన్య సమృద్ధి ఖాతా ఏప్రిల్ 1 నుండి క్లోజ్.. ఎందుకో తెలుసా

NPS, PPF and Sukanya Samriddhi: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను వినియోగించుకోవాలనుకుంటారు.

Update: 2022-03-29 05:45 GMT

NPS, PPF and Sukanya Samriddhi: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను వినియోగించుకోవాలనుకుంటారు. అందుకే సంస్థ అందించే కొన్ని స్కీముల్లో పెట్టుబడి పెడతారు. కొన్ని రోజులు రెగ్యులర్ గా అందులో డబ్బు జమ చేస్తారు. కానీ తరువాత దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే మార్చి 31లోపు కనీస పెట్టుబడి లేని ఈ ఖాతాలను ఇక కొనసాగించేది లేదంటూ ఖాతాదారులను అలెర్ట్ చేస్తోంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్చి 31 నాటికి మీరు ఈ ఖాతాల బ్యాలెన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఈ ఖాతాలను చెక్ చేయకుంటే, ఈరోజే వాటిని చెక్ చేయండి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలలో ఎలాంటి డబ్బును జమ చేయకుంటే, తప్పనిసరిగా మార్చి 31, 2022లోగా అవసరమైన కనీస మొత్తాన్ని అందులో వేయండి, లేకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతాలు ఒకసారి డీయాక్టివేట్ చేయబడితే, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాలి.

PPF లో డిపాజిట్ చేయవలసిన కనిష్ట మొత్తం- ఒక ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 500. దీనితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ కంట్రిబ్యూషన్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022. మీరు ఇంకా దానిలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే, రూ. 50 జరిమానాతో పాటు రూ. 500 బకాయి చందా చెల్లించాలి. మరోవైపు, ఖాతా మూసివేయబడితే, దానిలో మీకు ఎలాంటి రుణం లభించదు.

NPSలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం- నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఇప్పటి వరకు దీనిలో నగదు జమ చేయకపోతే దీని కోసం మీరు రూ. 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మీ NPS అకౌంట్ క్లోజ్ అయిపోతుంది.

సుకన్య సమృద్ధి ఖాతా పథకం- సుకన్య సమృద్ధి ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయడం తప్పనిసరి. లేదంటే దీనికి రూ.50 జరిమానా విధిస్తారు. అదే సమయంలో, SSY ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తి కాకుండానే డిఫాల్ట్ ఖాతాను క్రమబద్ధీకరించవచ్చు.

కాబట్టి మీరు ఏ పథకాల్లో అయితే పెట్టుబడి పెట్టి ఉంటారో వాటిని ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజులు చెక్ చేసుకుని వాటిల్లో నగదు జమచేయడం తప్పనిసరి లేదంటే ఆయా ఖాతాలు క్లోజ్ అవుతాయి. 

Tags:    

Similar News