ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్ సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందగా నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదించింది.;
ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్ సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందగా నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదించింది. 127రాజ్యాంగ చట్టసవరణ బిల్లుకు పార్లమెంట్ ఇప్పుడు ఆమోదించినట్లు అయింది. ఇక ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఇస్తూ చట్ట సవరణ చేసింది. త్వరలో రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించనుండగా ఆ తరవాత చట్టం అమల్లోకి రానుంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.