Odisha: మనిషేనా.. పాము కాటేసిందని కొరికేసి..
Odisha: పగ పాముల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉంటుందని నిరూపించాడు.. తనను కాటేసిన పామును కొరికి మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు.
Odisha: పగ పాముల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉంటుందని నిరూపించాడు.. తనను కాటేసిన పామును కొరికి మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు. పాము కాటుకు కనీసం వైద్యం చేయించుకోకుండా తిరుగుతున్న అతడిని చూసి గ్రామస్థులు భయపడుతున్నారు. ఛస్తావురా బాబు.. దవాఖానాకు పో. అని చెబుతున్నారు.
ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ తన పొలంలో పని చేసుకుంటుండగా అతడి కాలిపై నాగుపాము కాటువేసింది. గమనించి వెంటనే పారిపోతున్న పాముని పట్టుకున్నాడు. పాము తల, తోక పట్టుకుని మిగిలిన భాగం అంతా ఎక్కడికక్కడ కొరికి తన కసి తీర్చుకున్నాడు. దాంతో పాము చనిపోయింది. దాన్ని తీసి మెడలో వేసుకుని ఊళ్లో తిరిగాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడి నుంచి దూరంగా పారిపోయారు.. వైద్యుని వద్దకు తీసుకువెళతామన్నా రానని మొండికేశాడు. పాము మంత్రం తెలుసునని, తానే వైద్యం చేసుకుంటానని వివరించాడు.