Om Prakash Chautala : లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం..!

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఎట్టకేలకి పదో తరగతి పాస్ అయ్యారు. ఎప్పుడో 10వ త‌ర‌గ‌తి ఇంగ్లిష్‌లో ఫెయిలైన ఆయన ఆ తర్వాత చదువు మానేశారు.

Update: 2021-09-05 13:15 GMT

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఎట్టకేలకి పదో తరగతి పాస్ అయ్యారు. ఎప్పుడో 10వ త‌ర‌గ‌తి ఇంగ్లిష్‌లో ఫెయిలైన ఆయన ఆ తర్వాత చదువు మానేశారు. తాజాగా ఇటీవ‌ల 10వ త‌ర‌గ‌తి ఇంగ్లిష్ ప‌రీక్ష రాశారు. అయితే ఈ పరీక్షలో ఆయ‌న ఉత్తీర్ణులైన‌ట్లుగా హ‌ర్యానా స్కూల్ ఎడ్యుకేష‌న్ బోర్డు శ‌నివారం ప్రక‌టించింది. ఇంగ్లిష్ స‌బ్జెక్టులో మొత్తం 100 మార్కుల‌కు గాను ఆయనకీ 88 మార్కులు వ‌చ్చాయి.

కాగా చౌతాలా పదోతరగతి పాస్ కాకముందే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా సమయంలో ఆయన ఓపెన్ ఇంటర్ పరీక్ష ఫీజు కట్టారు. పరీక్షలు రాయకుండానే పాసైపోయారు. అయితే పదోతరగతి ఉత్తీర్ణత లేకపోవడంతో ఆ ఫలితాలను ఇంటర్ బోర్డు నిలిపివేసింది. పది పాస్ అయితేనే ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పడంతో ఆయన పదో తరగతి పరీక్ష రాశారు. అందులో తాజాగా ఉత్తీర్ణుడయి టెన్త్, ఇంటర్ పట్టాలు పొందారు ప్రకాష్ చౌతాలా. కాగా 1999 నుంచి 2005 వరకు ఓం ప్రకాశ్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News