Omicron in Kerala: ఒమిక్రాన్ వేళ జాగ్రత్తలు ఎలా.. హెల్త్ మినిస్టర్ ఏం చెబుతున్నారంటే..
Omicron in Kerala: దీర్ఘకాలిక దగ్గు, తీవ్ర జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.;
Omicron in Kerala: దాదాపు 96% రోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఓమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ దానిని తేలికగా తీసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వేవ్ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ గురువారం మీడియాతో అన్నారు.
కేరళలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసుల్లో 94 శాతం ఓమిక్రాన్ వేరియంట్‌లని, మిగిలిన ఆరు శాతం డెల్టా వేరియంట్‌లని మంత్రి సూచించారు. దీర్ఘకాలిక దగ్గు, తీవ్ర జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలోని 96.4 శాతం మంది కోవిడ్ రోగులు ఇంట్లోనే ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరడంతో పాటు ఇంటి సంరక్షణ కూడా అంతే ముఖ్యం.
ఆసుపత్రుల్లో ఐసీయూలు, వెంటిలేటర్ల వినియోగం తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు. కోవిడ్ -19 పాజిటివ్ అని తేలితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న హెచ్‌ఐవి పాజిటివ్ రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని, వైద్య సదుపాయం లేదనే కారణంతో చికిత్స నిరాకరిస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలను కోవిడ్ రోగులకు కేటాయించాలని మంత్రి అన్నారు.