Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్‌‌కు, ఎలుకలకు ఉన్న సంబంధం ఏంటి..?

Omicron Variant: ఇది ఎలా సోకుతుంది, దీని వల్ల ప్రమాదాలు ఏంటి అన్న అంశాలపై చాలాచోట్ల చర్చ కూడా మొదలయ్యింది.

Update: 2021-12-03 15:40 GMT

Omicron Variant: కోవిడ్ గోల పోయింది.. ఇంక అందరం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్న సమయంలోనే ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్ మరోసారి అందరినీ భమపెట్టడానికి వచ్చేసింది. ఇప్పటికే దీని గురించి ఎన్నో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఇది ఎలా సోకుతుంది, దీని వల్ల ప్రమాదాలు ఏంటి అన్న అంశాలపై చాలాచోట్ల చర్చ కూడా మొదలయ్యింది. అయితే తాజాగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

ఒమిక్రాన్ వేరియంట్ ఎలుకల వల్ల సోకి ఉండవచ్చని ఇమ్యునాలజిస్టులు అంటున్నారు. ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని వారు తెలిపారు. ముందుగా ఈ వైరస్ ఎలుకల్లో పుట్టుంటుందని.. ఆ తర్వాత అది అనేక రకాలుగా పరిణామం చెంది మనుషులకు సోకడం మొదలయి ఉండవచ్చని వారు అంటున్నారు. ఒమిక్రాన్‌లో ఉన్న 32 మ్యుటేషన్లలో 7 ఎలుకలకు సోకగలవని అధ్యయనాల్లో తేలింది.

ఒమిక్రాన్‌లో కనిపిస్తున్న చాలావరకు మ్యూటేషన్లు ఇతర వేరియంట్స్‌లో కనిపించలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒమిక్రాన్ జంతువుల నుండి వ్యాపించిందా లేదా క్రమంగా మానవుల్లో పరిణామం చెందిందా అనేది ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. కోవిడ్ సోకినప్పుడు కూడా అది బ్యాట్స్ వల్లే వచ్చిందని చెప్పిన శాస్త్రవేత్తల అనుమానాలు చాలావరకు నిజమయ్యాయి. ఇది కూడా అలాగే అయ్యి ఉండవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News