CBSE 12th Exams: సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల పై బోర్డు కీలక నిర్ణయం..

ఈ సబ్జెక్టుల్లో విద్యార్థుల పనితీరు ఆధారంగా రాయని సబ్జెక్టుల ఫలితం నిర్ణయించబడుతుంది.

Update: 2021-05-23 06:04 GMT

CBSE 12th Exams: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు లేకుండానే పాసైపోతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న కారణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

అయితే 12వ తరగతి విద్యార్థులకు మూడు మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ). ఈ సబ్జెక్టుల్లో విద్యార్థుల పనితీరు ఆధారంగా రాయని సబ్జెక్టుల ఫలితం నిర్ణయించబడుతుంది. ఇది బోర్డు ఆలోచన మాత్రమే. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించినా ఇంతకు ముందు మాదిరిగా పేపర్ 3 గంటలు ఉండదు ఒకటిన్న గంటల్లో అదీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయని బోర్డు తెలిపింది.

మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో వాయిదా పడిన 12 వ తరగతి పరీక్షలపై బోర్డు చర్చలు జరుపుతోంది.

సిబిఎస్‌ఇ, ప్రవేశ పరీక్షలపై చర్చించడానికి ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' సమక్షంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

"విద్యార్థుల భవిష్యత్తుని ప్రభావితం చేసే ఏ నిర్ణయం అయినా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని పిఎం తెలిపారు" అని ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ "అన్ని రాష్ట్ర విద్యా మంత్రులు, మరియు కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కావాలని పరీక్షల గురించి వారి అభిప్రాయాలను పంచుకోవాలని అభ్యర్థించారు. ఈ వర్చువల్ సమావేశం ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. "

Tags:    

Similar News