Om Birla: స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌

సంత‌కం చేయ‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు

Update: 2026-02-10 08:30 GMT

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా(Speaker Om Birla)పై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును అంద‌జేశాయి. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీతో పాటు ఇత‌ర విప‌క్ష ఎంపీల‌కు స్పీక‌ర్ అవకాశం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. 8 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్‌ను కూడా విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, చీఫ్ విప్ కే సురేశ్‌.. లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్‌కు త‌మ నోటీసును అంద‌జేశారు. కాంగ్రెస్, స‌మాజ్‌వాదీ, డీఎంకే పార్టీల త‌ర‌పున ఆ నోటీసును సెక్ర‌టేరియేట్‌కు స‌మ‌ర్పించారు.

అయితే అవిశ్వాస తీర్మానం నోటీసుపై మాత్రం తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు సంత‌కం చేయ‌లేదు. ఆ చ‌ర్య‌లో తాము భాగ‌స్వామ్యం కాద‌న్నారు. ఫిబ్ర‌వ‌రి రెండో తేదీ నుంచి రాహుల్ గాంధీ ప్ర‌సంగాన్ని ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది. దీంతో అప్ప‌టి నుంచి స‌రైన రీతిలో లోక్‌స‌భ వ్య‌వ‌హారాలు సాగ‌డంలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News