Omicron Variant: గుజరాత్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు.. దేశంలో మొత్తం మూడు..
Omicron Variant: ఇప్పటికే ఇండియా అంతా ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడుతోంది.;
Omicron Variant (tv5news.in)
Omicron Variant: ఇప్పటికే ఇండియా అంతా ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడుతోంది. సౌత్ ఆఫ్రికాలో మొదలయిన ఈ కొత్త రకం మహమ్మారి మన దేశంలోకి కూడా వచ్చి మళ్లీ అందరి జీవితాలను చీకటి చేస్తుందేమో అని వణికిపోతున్నారు. అనుకున్నట్టుగానే మెల్లమెల్లగా మన దేశంలో కూడా ఒమిక్రాన్ ఛాయలు కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది.
ఇప్పటికే ఫారిన్ నుండి కర్ణాటక వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. తాజాగా గుజరాత్‌లో కూడా ఒక వృద్ధుడికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న కోవిడ్ సోకినట్టు వారు నిర్ధారించారు. ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ ప్రభుత్వమే బయటపెట్టింది.
ఇటీవల జింబాబ్వే నుండి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన ఓ 72 ఏళ్ల వృద్ధుడిలో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కర్ణాటకలో రెండు, ఇప్పుడు గుజరాత్‌లో ఒకటి.. మొత్తం కలిపి దేశంలో ప్రస్తుతం మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య పెరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.