పంజాబ్ కొత్త సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
పంజాబ్ కొత్త సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం కుర్చీ ఎవరికి దక్కతుందనేది ఆసక్తిగా మారింది.;
పంజాబ్ కొత్త సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం కుర్చీ ఎవరికి దక్కతుందనేది ఆసక్తిగా మారింది. సీఎం ఎవరైతే బాగుంటుందన్న దానిపై శాసనసభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్న అధిష్టానం.. ఈ మధ్యాహ్యానికి కొత్త సీఎం పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.
కాగా రాహుల్ గాంధీతో అంబికా సోనీ భేటీ కావడంతో ఆమె పేరు దాదాపు ఖాయరైందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం పదవిని చేపట్టడానికి అంబికా సోనీ నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త సీఎం రేసులో ప్రధానంగా పీసీసీ మాజీ చీఫ్‌లు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా.. మాజీ మంత్రి సుఖ్‌జీందర్ సింగ్ రంధ్వా, మజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్ పేర్లు వినవస్తున్నాయి.
మొదట్లో పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పేరు వినవచ్చినా... సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆయనకు మైనస్ గా మారింది. సిద్ధూను ఎంపికచేస్తే ఎన్నికల ముందు మరింత తలనొప్పులు వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... మిగతా పేర్లను పరిశీలిస్తున్నది.